Chiruta: తిరుమలలో చిరుతపులి సంచారం... కొండపైకి ట్రాఫిక్ నిలిపివేత!

  • మొదటి ఘాట్ రోడ్డులో చిరుత
  • 52వ మలుపు వద్ద కనిపించిన చిరుత
  • భక్తుల ఆందోళన, రంగంలోకి అధికారులు

తిరుమల ఘాట్ రోడ్డులోకి ప్రవేశించిన ఓ చిరుతపులి ఎటువైపు వెళ్లాలో తెలియక రోడ్డుపైనే పరుగులు పెడుతూ ఉండటంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మొదటి ఘాట్ రోడ్డులోని 52వ మలుపు వద్ద ఓ చిరుతపులి భక్తులకు కనిపించింది. మోకాళ్ల పర్వతం మీదుగా వెళుతున్న భక్తులు దీన్ని చూసి అధికారులకు సమాచారం అందించారు.

ఆ ప్రాంతంలో చుట్టుపక్కలంతా లోయ ప్రాంతాలే ఉండటంతో ఎటెళ్లాలో తెలియని చిరుత రోడ్డుపై పరుగులు పెట్టింది. దీంతో తిరుమలలోని జీఎన్సీ టోల్ గేటు వద్దనే వాహనాలను నిలిపివేసిన అధికారులు, చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దీన్ని అవ్వాచారి కోనలోకి తరిమేస్తే అదే వెళ్లిపోతుందని, లేకుంటే పట్టుకుని తామే విడిచి పెడతామని అధికారులు అంటున్నారు. చిరుతపులి పట్టుబడిందా? లేక పారిపోయిందా? అన్న విషయమై ఇంకా సమాచారం అందలేదు.

More Telugu News