Sunny Leone: మా అమ్మాయి మూడో పుట్టినరోజు జరుపుకుంటోందన్న సన్నీ లియోన్

  • నిషా కౌర్ మూడో పుట్టినరోజు శుభాకాంక్షలు
  • ఓ పోస్ట్ చేసిన సన్నీ లియోన్ 
  • మా జీవితాల్లోకి నిషా ను తీసుకొచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు: వెబర్

తమ దత్తత కూతురు నిషా కౌర్ మూడో పుట్టినరోజు వేడుక జరుపుకుంటోందని బాలీవుడ్ నటి సన్నీ లియోన్ చెప్పింది. ప్రస్తుతం మెక్సికోలో ఉన్న సన్నీ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్ట్ చేసింది. తమ చిన్నారికి బర్త్ డే గ్రీటింగ్స్ చెబుతూ .. తన భర్త డానియల్ వెబర్, నిషాతో కలిసి ఓ బోట్ లో విహరిస్తున్న ఫొటోను ఆమె జతపరిచింది.

వెబర్ కూడా ఓ పోస్ట్ లో ఈ విషయాన్ని చెప్పారు. తమ జీవితాల్లోకి నిషాను తీసుకువచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెబర్ తన ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సుమారు ఏడేళ్ల క్రితం సన్నీ- వెబర్ వివాహం జరిగింది. ఆ తర్వాత ఇరవై ఒక్క రోజుల నిషాను వారు దత్తత తీసుకున్నారు. మరోపక్క, సన్నీ-వెబర్ జంటకు సరోగసీ ద్వారా జన్మించిన కవల అబ్బాయిలు ఉన్నారు.

More Telugu News