High Court: మూడు నెలల్లోగా తెలంగాణ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించండి!: హైకోర్టు ఆదేశం

  • ప్రత్యేక అధికారుల కొనసాగింపు రాజ్యాంగ విరుద్ధం
  • 3 నెలల్లోగా ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేయండి
  • వెంకటేశ్ అనే న్యాయవాది పిటిషన్ పై హైకోర్టు తీర్పు

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఈ రోజు కీలక ఉత్తర్వులు వెలువరించింది. వచ్చే 3 నెలల లోపు అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మూడు నెలల లోపు ప్రత్యేక అధికారుల సేవలను కొనసాగించుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది.

అయితే అప్పటిలోగా ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తెలంగాణలో పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడాన్ని సవాలు చేస్తూ వెంకటేశ్ అనే న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఈమేరకు తీర్పు ఇచ్చింది.

More Telugu News