vijay sethupathi: '96' తెలుగు రీమేక్ దర్శకుడిగా హరీశ్ శంకర్?

  • తమిళంలో హిట్ కొట్టిన '96'
  • విజయ్ సేతుపతి జోడీగా త్రిష 
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు

దిల్ రాజు .. హరీశ్ శంకర్ కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన 'దువ్వాడ జగన్నాథమ్' అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మాస్ అంశాల పరంగా మాత్రం మంచి మార్కులే తెచ్చుకుంది. దాంతో ఈ ఇద్దరి నేపథ్యంలో 'దాగుడు మూతలు' అనే మల్టీ స్టారర్ రానుందనే వార్తలు షికారు చేశాయి. కానీ ఆ కథ పట్ల దిల్ రాజు అంతగా ఆసక్తిని చూపలేదు. తాజాగా ఆయన '96' తెలుగు రీమేక్ ను హరీశ్ శంకర్ తో చేయించనున్నాడనేది ఫిల్మ్ నగర్ టాక్. ఇటీవల తమిళంలో విడుదలైన '96' మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ ప్రేమకథా చిత్రంలో విజయ్ సేతుపతి .. త్రిష జంటగా నటించారు. ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. హరీశ్ శంకర్ చేతిలో ఈ ప్రాజెక్టును పెట్టాలనే ఉద్దేశంతో దిల్ రాజు వున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయట!    

More Telugu News