Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రకటన సంతోషించదగ్గ విషయం.. కానీ..!: టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

  • ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ చెప్పడం హర్షణీయం
  • చేసిన తప్పును దిద్దుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారు
  • రాష్ట్రాన్ని విభజించినందుకు క్షమాపణలు చెబితే బాగుండేది

ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించడం సంతోషించదగ్గ విషయమని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం రాహుల్ చేస్తున్నారని... ఆయన వ్యాఖ్యలను ఆహ్వానించాలని చెప్పారు. రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, బీజేపీలకు సమంగా ఉందని అన్నారు.

 అయితే, రాష్ట్రాన్ని విభజించి తప్పుచేశామని, దానికి క్షమాపణలు చెబుతున్నామని రాహుల్ చెప్పిఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఆయనను పూర్తిగా నమ్మే పరిస్థితి వచ్చేదని అన్నారు. ఏపీకి అన్నీ చేస్తామని చెప్పిన ప్రధాని మోదీ మోసం చేశారని... ఈ నేపథ్యంలో, రాహుల్ మాటలను కూడా పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. సీడబ్ల్యూసీ సమావేశంలో కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్, సోనియాలు చెప్పారని గుర్తు చేశారు. ఓ మీడియా చానల్ తో మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ ఈమేరకు స్పందించారు.

ఈరోజు కర్నూలులో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ తాము నెరవేరుస్తామని ఆయన చెప్పారు.

More Telugu News