Nirav Modi: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరికి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు

  • అంతర్జాతీయంగా మనీల్యాండరింగ్‌తో సంబంధాలు
  • అరబ్, సింగపూర్‌లలోని సంస్థలకు యజమానురాలిగా పుర్వి
  • మిహిర్‌ ఆర్‌ భన్సాలీకి కూడా నోటీసులు

పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయల మేర ముంచేసి దేశం నుంచి పరారైన నీరవ్ మోదీ సోదరి పుర్వి దీపక్‌ మోదీకి ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది. మనీ ల్యాండరింగ్‌తో అంతర్జాతీయంగా ఆమెకు సంబంధాలున్నాయన్న ఆరోపణలతో వీటిని జారీ చేసినట్టు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ఆమె కూడా ప్రధాన పాత్ర పోషించినట్టు ఈడీ, సీబీఐలు ఇప్పటికే నిర్ధారించాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్టు సమాచారం.

సింగపూర్, అరబ్ దేశాల్లో ఉన్న కొన్ని వ్యాపార సంస్థలకు పుర్వి యజమానిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యాపార సంస్థలకు సంబంధించి కొన్ని లావాదేవీలు ఆమె పేరుతోనే జరిగినట్టు ఈడీ తెలిపింది. ఆమెతోపాటు నీరవ్‌ మోదీ వ్యాపార సంస్థలో టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అయిన మిహిర్‌ ఆర్‌ భన్సాలీకి కూడా ఇంటర్ పోల్ నోటీసులు జారీ చేసింది.

More Telugu News