Samanta: అమ్మో సమంతా... ఇలా నటించావా?

  • వివాహం తరువాత కూడా గ్లామర్ రోల్స్ వదలని సమంత
  • తాజాగా విడుదలైన 'సీమరాజా' ట్రైలర్
  • హాట్ టాపిక్ గా మారిన సమంతను ఎత్తుకునే సీన్

వివాహమైనా, గ్లామర్ రోల్స్ ను వదలకుండా, ఫ్యాన్స్ ను అలరిస్తున్న సమంత, తన తాజా చిత్రంలో చేసిన ఓ సీన్, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 'సీమరాజా' పేరిట తమిళంలో ఆమె శివకార్తికేయన్ సరసన నటించగా, ఈ చిత్ర ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో సమంత పల్లెటూరి పిల్లగా కనిపిస్తుండగా, శివకార్తికేయన్ మాస్ లుక్‌ లో అదరగొడుతున్నాడు. ట్రైలర్ లో సమంతను శివ ఎత్తుకునే ఓ సీన్ ఉండగా, దాని స్క్రీన్ షాట్, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటివరకూ సమంత, తాను నటించిన ఏ చిత్రంలోనూ ఇటువంటి సీన్ చేయలేదట. దీంతో ఈ సీన్ చూసిన వారంతా 'అమ్మో సమంతా...' అనేస్తున్నారు. సమంతతో పాటు సిమ్రాన్, నెపోలియన్ తదితరులు నటించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా విడుదలకానుంది.

More Telugu News