Kerala: తోచినంత సాయం చేయండి... కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతా వివరాలు ఇవిగో!

  • భారీ వర్షాల వెనుకే వచ్చిన వరదలు
  • సాయం చేసే చేతుల కోసం కేరళ ఎదురుచూపులు
  • ఇప్పటికే పలువురి విరాళాలు

ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఆ వెనుకే వచ్చిన వరదలతో విలయభూమిగా మారిన కేరళను ఆదుకునేందుకు చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రూ. 5 కోట్ల నుంచి రూ. 25 కోట్ల వరకూ సాయం ప్రకటించగా, కేంద్రం ఇప్పటికే రూ. 600 కోట్ల ఆర్థిక సాయం అందించింది. యూఏఈ, మలేషియా వంటి దేశాలు సైతం కేరళ పరిస్థితి చూసి చలించి తమవంతు సాయాన్ని ప్రకటించాయి. పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు.

ప్రజలు ఎవరైనా కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి తోచినంత సాయం చేసి ఆదుకోవాలని పినరయి విజయన్ కోరారు.
సాయం చేయాల్సిన బ్యాంకు ఖాతా వివరాలు...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తిరువనంతపురం
ఎకౌంట్ నంబర్. 67319948232
IFSC Code: SBIN0070028
PAN No: AAAGD0584M
SWIFT Code: SBININBBT08

More Telugu News