nagachaitanya: గోవాలో సందడి చేసిన 'శైలజా రెడ్డి అల్లుడు'

  • మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' 
  • పవర్ఫుల్ రోల్ లో రమ్యకృష్ణ 
  • ఈ నెల 31వ తేదీన విడుదల     

మారుతి దర్శకత్వంలో .. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందుతోంది. నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషిస్తోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. చైతూ .. అనూ ఇమ్మాన్యుయేల్ పై ఒక రొమాంటిక్ సాంగ్ ను అక్కడ చిత్రీకరించారు. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందనీ .. యూత్ హృదయాలను కొల్లగొట్టేసేదిగా ఉంటుందని అంటున్నారు. ఈ పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తయింది. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. హీరోకి అత్తగా రమ్యకృష్ణ పవర్ఫుల్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.   

More Telugu News