Seethamma Vakitlo Sirimalle Chettu: తమిళంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. విడుదలకు చురుగ్గా ఏర్పాట్లు!

  • చెన్నైలో ఆడియో రిలీజ్
  • ఆగస్టు చివరిలో విడుదల చేసే అవకాశం
  • తమిళనాడులో దర్శనమిస్తున్న సినిమా పోస్టర్లు

రొటీన్ చిత్రాలకు భిన్నంగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వెంకటేశ్, మహేశ్ బాబు, సమంత, అంజలి, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్లతో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. తాజాగా ఈ సినిమాను తమిళంలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


రోల్స్ ప్రైడ్ మీడియా బ్యానర్ పై ‘నెంజమెల్లా పలవన్నం’ పేరుతో ఈ సినిమా తమిళంలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఆడియో రిలీజ్ సోమవారం చెన్నై, ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ చిత్రానికి ఏఆర్ కే రాజా మాటలు, పాటలు రాశారు. ఈ కార్యక్రమానికి గిల్డ్ అధ్యక్షుడు జాకువార్ తంగం, పీఆర్వో సంఘం చీఫ్ విజయమురళి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నెల చివరిలో లేదా సెప్టెంబర్ మొదటివారంలో సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో నెంజమెల్లా పలవన్నం పోస్టర్లు, కటౌట్లు దర్శనమిస్తున్నాయి.

More Telugu News