Priyaanka Chopra: 'క్వాంటికో'కు గుడ్ బై చెప్పిన ప్రియాంకా చోప్రా!

  • ప్రియాంకకు పేరు తెచ్చిన క్వాంటికో
  • సిరీస్ ముగిసిందన్న ప్రియాంక
  • 'అలెక్స్' పాత్రకిక గుడ్ బై చెప్పిన బాలీవుడ్ బ్యూటీ

తనకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చి పెట్టడంతో పాటు హాలీవుడ్ చాన్స్ లనూ దగ్గర చేసిన 'క్వాంటికో' సిరీస్ కు ప్రియాంక గుడ్ బై చెప్పింది. ఈ సిరీస్ లో అలెక్స్ పారిష్ పాత్రలో నటించి, మెప్పించిన ప్రియాంకకు పీపుల్స్ చాయిస్ అవార్డు కూడా లభించిన సంగతి తెలిసిందే. క్వాంటికో సిరీస్ పూర్తి అయిందని, భావోద్వేగంతో తాను అలెక్స్ పారిష్ పాత్రకు గుడ్ బై చెబుతున్నానని ప్రియాంక తాజాగా వ్యాఖ్యానించింది.

 ఈ పాత్ర మానసికంగా, శారీరకంగా సవాలుతో కూడినదని, తనకు ఎంతో గొప్ప గుర్తింపును తెచ్చిందని ఈ సందర్భంగా ఆమె చెప్పింది. తన కోసం ప్రతి వారం టీవీలను చూసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పిన ప్రియాంక, క్వాంటికో బృందానికి కూడా ధన్యవాదాలు చెప్పింది. ఈ టీమ్ తో కలసి పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగించిందని చెబుతూ ట్వీట్ చేసిన ప్రియాంక, చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.

More Telugu News