Hardhik Patel: ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన కేసులో.. హార్దిక్ పటేల్ కు రెండేళ్ల జైలుశిక్ష!

  • 2015లో పటీదార్ ఉద్యమం
  • యువతను హింసకు ప్రేరేపించిన హార్దిక్ పటేల్
  • పై కోర్టుకు అపీలు చేసుకోవచ్చన్న న్యాయమూర్తి

గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గ యువనేత హార్దిక్ పటేల్ కు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్టు కోర్టు తీర్పిచ్చింది. 2015లో పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ, పటీదార్ సామాజిక వర్గం తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టి, ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం కలిగించిన కేసులో హార్దిక్ ను కోర్టు దోషిగా తేల్చింది.

యువతను ఆయనే విధ్వంసానికి రెచ్చగొట్టారంటూ పోలీసులు సమర్పించిన వీడియో సాక్ష్యాలను, పత్రికల్లో వచ్చిన వార్తలు, వాట్స్ యాప్ గ్రూపుల్లో వైరల్ అయిన పోస్టులు, ఆపై విచారణ సందర్భంగా వెల్లడైన వాస్తవాలను పోలీసులు కోర్టు ముందుంచారు. ఈ కేసులో విచారణ దాదాపు రెండున్నరేళ్లు సాగగా, హార్దిక్ ను దోషిగా తేలుస్తూ రెండు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తున్నామని, ఆయన పైకోర్టుకు అపీల్ చేసుకోవచ్చని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.

More Telugu News