UTS: సాధారణ రైలు టికెట్ల కోసం యాప్... 8 రోజుల్లో మిలియన్ డౌన్ లోడ్లు!

  • 'యూటీఎస్ ఆన్ మొబైల్' యాప్ కు పెద్ద ఎత్తున స్పందన
  • నగదుతో రీచార్జ్ చేసుకున్న 50 వేల మంది
  • రైల్వే కౌంటర్లలో నిలబడాల్సిన అవసరం లేదు 

ఇటీవల రైల్వే శాఖ ప్రవేశపెట్టిన 'యూటీఎస్ ఆన్ మొబైల్' యాప్ కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సాధారణ రైలు టికెట్లను స్మార్ట్ ఫోన్ నుంచి బుక్ చేసుకునే సదుపాయం కల్పించే ఈ యాప్ ను 8 రోజుల వ్యవధిలో 10 లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. యాప్ ద్వారా టికెట్ల బుకింగ్ కు 16వ తేదీ నుంచి అవకాశం కల్పించగా, కాగిత రహిత టికెట్ల కొనుగోలు కోసం 50 వేల మంది నగదుతో రీచార్జ్ చేసుకున్నారని అధికారులు తెలిపారు.

కౌంటర్ లోని భారీ క్యూలో నిలబడి, రైలు బయలుదేరే లోగా, టికెట్ తీసుకోగలమా? అనే టెన్షన్ తో ఉండే ప్రయాణికులు  ఈ యాప్ ద్వారా సులువుగా టికెట్ బుక్ చేసుకుంటున్నారు. అయితే, టికెట్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు ఈ యాప్ ద్వారా కలుగక పోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తోందని ప్రయాణికులు అంటున్నారు.

ఈ యాప్ రైల్వే స్టేషన్ కు 5 కిలోమీటర్ల పరిధిలోనే పనిచేస్తుండటంతో కాస్త ఇబ్బందిగా ఉందని, ప్రయాణం చేయాల్సిన రోజు మాత్రమే టికెట్ లు బుక్ చేసుకునే నిబంధనను కూడా మార్చాలని కోరుతున్నారు.  

More Telugu News