raghuveera reddy: గత పార్లమెంటు సమావేశాల్లో మోదీ పిరికిపందలా పారిపోయారు: రఘువీరారెడ్డి

  • ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని అధిష్ఠానాన్ని కోరాం
  • హైకమాండ్ సానుకూలంగా స్పందించింది
  • యూపీయే భాగస్వామ్య పక్షాలతో మాట్లాడతామని తెలిపింది

రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని పెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. గత పార్లమెంటు సమావేశాల్లో యూపీయే భాగస్వామ్య పక్షాలను కూడా ఒప్పించుకుని, ఏపీలో ఉన్న పార్టీలను కూడా కలుపుకుని అవిశ్వాసాన్ని పెట్టామని... అవిశ్వాసంపై చర్చను ఎదుర్కోలేక ప్రధాని మోదీ పిరికిపందలా పారిపోయారని అన్నారు.

పార్లమెంటు సమావేశాలను సక్రమంగా సాగనివ్వకుండా కూడా చేశారని విమర్శించారు. ఏఐడీఎంకే సభ్యులను శిఖండిలా అడ్డుపెట్టుకుని, సభను జరగకుండా చేశారని దుయ్యబట్టారు. అందుకే ఇప్పుడు జరగనున్న సమావేశాల్లో కూడా అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని అధిష్ఠానాన్ని కోరామని.... అధిష్ఠానం కూడా సానుకూలంగా స్పందించిందని చెప్పారు. యూపీయే భాగస్వామ్య పక్షాలతో కూడా మాట్లాడతామని చెప్పారని తెలిపారు. ప్రత్యేక హోదాతో పాటు, ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనని అన్నారు.

More Telugu News