sunny leone: సన్నీ లియోన్ బయోపిక్ ట్రైలర్ విడుదల

  • 'కరణ్ జీత్ కౌర్: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్' పేరిట బయోపిక్
  • సినిమాలా కాకుండా, వెబ్ సిరీస్ లా ప్రేక్షకుల ముందుకు
  • ఈనెల 16న ఓ ఆంగ్ల ఛానల్ లో ప్రసారం

బాలీవుడ్ నటి సన్నీలియోన్ జీవిత కథతో 'కరణ్ జీత్ కౌర్: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్' పేరిట ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. దీన్ని ఒక సినిమాలా కాకుండా, వెబ్ సిరీస్ లా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో సన్నీ పాత్రలో రైసా సౌజానీ అనే అమ్మాయి నటించింది.

దీనికి సంబంధించిన ట్రైలర్ ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. సన్నీకి మేకప్ వేస్తున్న సన్నివేశంతో  ట్రైలర్ మొదలవుతుంది. అనంతరం చిన్నతనంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టడం, ఫొటో షూట్లు, తల్లిదండ్రులు తిట్టడం, ఇంటర్వ్యూలో సన్నీని అసభ్యకర ప్రశ్నలు అడిగిన సన్నివేశాలను చూపించారు. ఈనెల 16న ఓ ఆంగ్ల ఛానల్ లో ఈ సిరీస్ ప్రసారం కానుంది.

ఈ లింక్ ద్వారా ట్రైలర్ ను వీక్షించవచ్చు...
https://www.youtube.com/watch?time_continue=4&v=edJ6DnPXh8o

More Telugu News