nagachaitanya: 'శైలజా రెడ్డి అల్లుడు' ఫస్టులుక్ వచ్చేస్తోంది

  • షూటింగు దశలో 'శైలజా రెడ్డి అల్లుడు'
  • జూలై 1వ తేదీన ఫస్టులుక్ 
  • ఆగస్టు 31న సినిమా విడుదల  

మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందుతోంది. నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో కీలకమైన పాత్రను రమ్యకృష్ణ పోషిస్తోంది. ఈ సినిమాకి ఆమె పాత్ర హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.

ఈ సినిమా ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జూలై 1వ తేదీన టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయడానికి మారుతి సన్నాహాలు చేస్తున్నాడు. చైతూ సింగిల్ స్టిల్ తోనే ఈ ఫస్టులుక్ పోస్టర్ వుండనుందనే టాక్ వినిపిస్తోంది. జూలై 25వ తేదీ నాటికి పాటలతో సహా ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసే దిశగా పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న అనూ ఇమ్మాన్యుయేల్ కి, ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి మరి.      

More Telugu News