infosys: ఇన్ఫోసిస్ లో నాడు రూ.10వేలు పెట్టి ఉంటే... నేడు రూ.2.5 కోట్లు!

  • 1993లో ఐపీవో తర్వాత లిస్ట్ అయిన కంపెనీ
  • 5 మిలియన్ డాలర్ల నుంచి 10.9 బిలియన్ డాలర్ల ఆదాయానికి...
  • 250 మంది ఉద్యోగుల నుంచి 2 లక్షల మంది ఉద్యోగుల స్థాయికి చేరిక

దేశ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి నేటితో 25 సంవత్సరాలు. కానీ కంపెనీ 37 ఏళ్లుగా కార్యకలాపాల్లో ఉంది. ఈ కాలంలో కంపెనీ ఎంతో ఘనతను సొంతం చేసుకుంది. 1981లో నారాయణమూర్తి, మరో ఆరుగురు కలసి ఏర్పాటు చేశారు. 250 డాలర్ల పెట్టుబడితో ప్రారంభించారు. మూర్తి తన శ్రీమతి సుధామూర్తి దగ్గర రూ.10,000 బదులు తీసుకుని పెట్టుబడి సమకూర్చారు.

1993లో ఇన్ఫోసిస్ లిస్ట్ అయింది. నాడు ఐపీవో పూర్తిగా సబ్ స్క్రయిబ్ కాకపోతే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ ఇనామ్, మోర్గాన్ స్టాన్లీ ఆదుకున్నాయి. ఒక్కో షేరును రూ.90కు ఆఫర్ చేయగా, రూ.160 దగ్గర లిస్ట్ అయ్యాయి. 5 మిలియన్ డాలర్ల కంపెనీ నుంచి నేడు 10.9 బిలియన్ డాలర్ల ఆదాయం (రూ.73,030 కోట్లు) కంపెనీగా ఎదిగిన క్రమం అద్భుతం.

 250 మంది ఉద్యోగుల నుంచి 2 లక్షల ఉద్యోగుల కంపెనీగా రూపుదాల్చింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.2.8 లక్షల కోట్లు.  దేశంలో ఏడో అత్యంత విలువైన కంపెనీ. 1993లో ఇన్ఫోసిస్ ఐపీవోలో రూ.10,000 ఇన్వెస్ట్ చేసిన వారు ఆ షేర్లను అమ్ముకోకుండా ఇప్పటికీ ఉంచుకుని ఉంటే బోనస్ లు, స్టాక్ స్ప్లిట్ లు కలుపుకుని రూ.2.5 కోట్ల విలువకు చేరేవి.

More Telugu News