chaitu: 'శైలజా రెడ్డి అల్లుడు' కోసం రంగంలోకి దిగిన రమ్యకృష్ణ

  • మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
  • ఈ నెల 18 నుంచి తదుపరి షెడ్యూల్ 
  • ఆగస్టు చివరిలో రిలీజ్ చేసే ఆలోచన    

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కీలకమైన అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మిగతా 50 శాతం చిత్రీకరణకు పక్కాగా ప్లాన్ చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో తదుపరి షెడ్యూల్ షూటింగును జరపనున్నారు. 15 రోజుల పాటు ఇక్కడ చిత్రీకరణ కొనసాగుతుంది. సొగసరి అత్తగా .. గడసరి అల్లుడుగా ఈ సినిమాలో రమ్యకృష్ణ .. చైతూ మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు వున్నాయి. మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే ఆ సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తారట. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను .. ఆగస్టు చివరివారంలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  

More Telugu News