Pakistan: పాకిస్థాన్ కు దిమ్మతిరిగే సమాధానం.. 10కి పైగా బంకర్లు ధ్వంసం

  • సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్
  • దీటుగా సమాధానం ఇచ్చిన బీఎస్ఎఫ్ జవాన్లు
  • సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు

అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మరోసారి బరితెగించిన పాకిస్థాన్ కు మన బీఎస్ఎఫ్ బలగాలు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాయి. జమ్ముకశ్మీర్ లోని అక్నూర్ సెక్టర్ లో జనావాసాలను లక్ష్యంగా చేసుకుని నిన్న రాత్రి నుంచి పాక్ బలగాలు భారీ ఎత్తున కాల్పులకు తెగబడ్డాయి. దీనికి ప్రతిగా బీఎస్ఎఫ్ బలగాలు ప్రతిదాడులకు దిగాయి. బీఎస్ఎఫ్ దాడుల్లో 10కి పైగా పాక్ బంకర్లు ధ్వంసమయినట్టు సమాచారం. మరోవైపు, పాక్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ విజయ్ కుమార్, ఏఎస్ఐ సత్యనారాయణ యాదవ్ లు వీరమరణం పొందారు.

కాల్పుల నేపథ్యంలో, సరిహద్దుల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డీజీఎంవో స్థాయిలో చర్చలు జరిపిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ కాల్పుల విరమణ చట్టానికి తూట్లు పొడవడం గమనార్హం. పాకిస్థాన్ కాల్పులను జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఖండించారు.

More Telugu News