Tamilnadu: 'కనీసం ఒక్కడైనా చావాల్సిందే' అంటున్న పోలీసు.. తూత్తుకుడి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్!

  • తూత్తుకుడిలో స్టెరిలైట్ ఫ్యాక్టరీ వద్దంటూ నిరసనలు
  • 100వ రోజు నిరసన హింసాత్మకం
  • మొత్తం మృతుల సంఖ్య 11

తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో ఉన్న స్టెరిలైట్ ఇండస్ట్రీస్ కాపర్ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ గత 100 రోజులుగా జరుగుతున్న ప్రజల నిరసనలు, ఉద్ధృతమై, పోలీసు కాల్పుల్లో 9 మంది, ఆపై జరిగిన పరిణామాల్లో మరో ఇద్దరు మరణించి, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడి విషమ పరిస్థితుల్లో ఉన్న వేళ, బయటకు వచ్చిన ఓ వీడియో సంచలనం కలిగిస్తోంది.

ఈ వీడియోలో తుపాకులతో కాల్చాలని, కనీసం ఒక్కరన్నా చావాల్సిందేనని ఓ పోలీసు అంటున్న గొంతు వినిపిస్తోంది. "కనీసం ఒక్కరైనా చనిపోవాల్సిందే" అంటున్న పోలీసు గొంతు, ఆపై బులెట్ ఫైరింగ్ శబ్దం వినిపిస్తోంది. అయితే, సదరు పోలీసు కాల్చిన బులెట్ కారణంగా ఎవరైనా చనిపోయారా? లేదా? అన్న విషయమై స్పష్టత లేదు. ఆ వీడియోను జాతీయ వార్తా సంస్థ 'ఏఎన్ఐ' బయటపెట్టింది. దాన్ని మీరూ చూడండి.

More Telugu News