kumara swamy: కుమారస్వామి కుటుంబంతో చంద్రబాబు అనుబంధం ఈనాటిది కాదు: ఏపీ మంత్రులు

  • ప్రమాణస్వీకార కార్యక్రమానికి బాబు వెళ్లడంపై అపోహలొద్దు
  • నాడు దేవెగౌడను పీఎం చేయడంలో చంద్రబాబుది కీలకపాత్ర  
  • ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల బలోపేతం అవసరం
  • అందులో భాగంగానే కాంగ్రెస్-జేడీఎస్ కలిశాయి

కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామిగౌడ కుటుంబంతో చంద్రబాబు అనుబంధం ఈనాటిది కాదని ఏపీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అమర్ నాథ్ రెడ్డి అన్నారు. ఈరోజు వారు మీడియాతో మాట్లాడుతూ, నాడు దేవెగౌడను ప్రధానిని చేయడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పటికీ .. కుమారస్వామి ప్రమాణ స్వీకారం కోసమే చంద్రబాబు అక్కడికి వెళ్తున్నారని చెప్పారు.

కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది కానీ, ఆ రాష్ట్రంలో ఏర్పాటయ్యేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల బలోపేతం అవసరమని, అందులో భాగంగానే కాంగ్రెస్-జేడీఎస్ కలిశాయని అన్నారు. జాతీయపార్టీలు, దక్షిణాదిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని, కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు వెళ్లడంపై ఎలాంటి అపోహలొద్దని సూచించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ తో కలిసే ఆలోచన గానీ, అభిప్రాయం గానీ టీడీపీకి లేవని స్పష్టం చేశారు.

More Telugu News