yeddyurappa: యడ్యూరప్పకు సవాల్ విసిరిన సిద్ధరామయ్య

  • బీజేపీవి దారుణమైన రాజకీయాలు
  • ముందు 112 మంది ఎమ్మెల్యేల పేర్లను యడ్డీ వెల్లడించాలి
  • బీజేపీ రాజకీయాలను ప్రజలకు వివరిస్తాం

బీజేపీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ లేనప్పటికీ, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని... ఇదే అంశంపై తాము ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. బీజేపీ చేస్తున్న దారుణ రాజకీయాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. యడ్యూరప్ప తన మెజారిటీ నిరూపించుకోవాలనుకుంటే... ముందు 112 మంది ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలని సవాల్ విసిరారు.

మరోవైపు, కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఈ ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. బలపరీక్షకు గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చారు. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తమకు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించకపోవడంపై జేడీఎస్, కాంగ్రెస్ కూటమి నిన్న అర్ధరాత్రి సుప్రీంకోర్టు తలుపు తట్టిన సంగతి తెలిసిందే. 

More Telugu News