samanta: జోరుగా 'యూ టర్న్' షూటింగ్ .. ఆటోలో సమంత

  • కన్నడ మూవీకి రీమేక్ గా 'యూ టర్న్'
  • సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో సాగే సినిమా 
  • కీలకమైన పాత్రలో భూమిక

ఇప్పుడు వరుస విజయాలతో సమంత ఫుల్ ఖుషీగా వుంది. 'రంగస్థలం' .. 'మహానటి' .. ' ఇరుంబు తిరై' వంటి సినిమాలు విశేషమైన ప్రజాదరణ పొందాయి. ఊహించని విధంగా హ్యాట్రిక్ హిట్ .. అదీ చాలా తక్కువ గ్యాప్ లో పడటం ఆమెను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఉత్సాహంతో ఆమె తన తదుపరి సినిమా అయిన 'యూ టర్న్' షూటింగులో పాల్గొంటోంది.

కొంతకాలం క్రితం కన్నడలో భారీ విజయాన్ని అందుకున్న సినిమాకి ఇది రీమేక్. అదే పేరుతో అదే దర్శకుడు పవన్ కుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన ఈ సినిమాలో సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. షూటింగులో భాగంగా సమంత ఆటో ఎక్కిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. భూమిక కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేయనున్నారు.   

More Telugu News