KCR: తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీపి కబురు.. 14న పీఆర్సీపై ప్రకటన!

  • ఈనెల 14న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కేసీఆర్ సమావేశం
  • అదే రోజు పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం
  • 11న సీఎంకు నివేదిక సమర్పించనున్న మంత్రివర్గ ఉప సంఘం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 14న మధ్యాహ్నం 2 గంటలకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అనంతరం వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.

సమావేశంలో పదవీ విరమణ వయసు పెంపు, బదిలీలు, పీఆర్సీ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) సహా ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన 18 డిమాండ్లు, ఉపాధ్యాయ సంఘాలు తెరపైకి తీసుకొచ్చిన 36 డిమాండ్లపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. అలాగే, పీఆర్సీ కమిటీ ఏర్పాటు, నివేదిక గడువు, వేతన సవరణను అమలు కాలవ్యవధి తదితర అంశాలపైనా చర్చించనున్నారు.

మరోవైపు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై మంత్రివర్గ ఉపసంఘం సిద్ధం చేస్తున్న నివేదికను శుక్రవారం సీఎం కేసీఆర్‌కు అందించనుంది.

More Telugu News