Karnataka: రాజ్యాంగాన్ని మారిస్తే దేశంలో రక్తపాతమే!: సీఎం సిద్ధరామయ్య హెచ్చరిక

  • బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సిద్ధరామయ్య
  • అనంత్‌కుమార్ హెగ్డే అసలు గ్రామ పంచాయతీ నేతగా కూడా పనికిరాడంటూ వ్యాఖ్య
  • బీజేపీకి సామ్యవాదం, సామాజిక న్యాయం తెలియవన్న సీఎం  

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే ఇంతకు ముందు రాజ్యాంగాన్ని తిరగరాస్తామంటూ, కాంగ్రెస్ పరిపాలనను విమర్శిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీపైన, కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ పైన విరుచుకుపడ్డారు.

అసమర్థ అనంత్‌కుమార్ హెగ్డే అసలు గ్రామ పంచాయతీ నేతగా కూడా పనికిరాడని, అలాంటి వ్యక్తిని కేంద్ర మంత్రిని చేశారంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఒకవేళ నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని మార్చడం లాంటి పని చేస్తే దేశంలో రక్తపాతమే జరుగుతుందని ఈ సందర్భంగా సిద్ధరామయ్య హెచ్చరించారు. పేదలకు మంచి పనులు చేయడం, సామ్యవాదం, సామాజిక న్యాయం లాంటివి ఆ పార్టీకి అస్సలు తెలియదని ఆయన విమర్శించారు.

More Telugu News