Allu Arjun: 'నా పేరు సూర్య' తొలిరోజు వసూళ్లు 40 కోట్లు!

  • నిన్ననే విడుదలైన 'నా పేరు సూర్య'
  • భారీ స్థాయిలో ఓపెనింగ్స్ 
  • మరింత పెరగనున్న వసూళ్లు

వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ అల్లు అర్జున్ కథానాయకుడిగా 'నా పేరు సూర్య' చిత్రాన్ని తెరకెక్కించాడు. నిన్ననే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టు సమాచారం.

తొలిరోజునే ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే వేసవి సెలవులు కావడం వలన .. బన్నీ సినిమా అంటే కంటెంట్ డిఫరెంట్ గా వుంటుందనే నమ్మకం కారణంగా ఈ సినిమాకి ఈ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నారు. శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరగడం ఖాయం కనుక, మూడు రోజుల వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     

More Telugu News