tripura cm: నోరు పారేసుకుంటున్న త్రిపుర ముఖ్యమంత్రికి ఢిల్లీ నుంచి అధిష్ఠానం పిలుపు

  • మే 2న రావాలంటూ పిలుపు
  • ఆయన వ్యాఖ్యలపై కర్ణాటక ఎన్నికల్లో నష్టం కలిగిస్తాయని ఫిర్యాదు
  • ప్రధాని మోదీ ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చే అవకాశం

బహిరంగంగా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాలని ప్రధాని మోదీ పార్టీ నేతలు అందరికీ సూచించగా, త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ తనదైన శైలిలో వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. దీంతో మే 2న ఢిల్లీకి రావాలని ఆయనకు పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. చాలా మంది బీజేపీ నేతలు ఈ విషయంలో ఆగ్రహంగా ఉన్నారని, ప్రధాని మోదీజీ ఆయనతో మాట్లాడతారని బీజేపీ సీనియర్ నేత ఒకరు మీడియాకు సమాచారం అందించారు. దేవ్ వ్యాఖ్యలు కర్ణాటక ఎన్నికల్లో పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పలువురు ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.

ఇటీవల త్రిపుర ఎన్నికల్లో ప్రజలు బీజేపీ సంకీర్ణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని, ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారే గానీ, అనవసర వివాదాలు సృష్టించాలని కాదని ఓ బీజేపీ నేత తెలిపారు. డయానా హెడెన్ తెల్లగా లేకపోయినా ఆమెకు ప్రపంచ సుందరి కిరీటం ఎలా ఇచ్చారని, ఉద్యోగాన్వేషణ కోసం సమయం వృథా చేసుకోకుండా ఆవులు, పందుల పెంపకం ద్వారా ఉపాధి పొందాలని, పాన్ షాపులు పెట్టుకోవాలంటూ విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

More Telugu News