pavan: అందమైన ప్రేమకథకు అద్దం పట్టిన 'ఖుషి'కి 17 యేళ్లు

  • పవన్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా 'ఖుషి'
  • ఆయనకి స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రం 
  • ఆ సినిమాను ఇప్పటికీ మరిచిపోని ఫ్యాన్స్  

పవన్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'ఖుషి' ఒకటిగా కనిపిస్తుంది. సిద్ధూ .. సిద్ధార్థ్ రాయ్ అంటూ ఈ సినిమాలో పవన్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమాలో పవన్ చేసిన పాత్రను ప్రేక్షకులు మరిచిపోలేదు. అందమైన ప్రేమకథగా కుర్రకారును పలకరించిన ఈ సినిమా, ఆ తరువాత వచ్చిన ఎన్నో ప్రేమకథలకు స్ఫూర్తిగా నిలిచింది.

అలాంటి ఈ సినిమా ఈ రోజుతో 17 యేళ్లను పూర్తి చేసుకుంది. 2001 .. ఏప్రిల్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా, కథాపరంగాను . పాటల పరంగాను యూత్ ను మరో లోకంలోకి తీసుకెళ్లింది. పవన్ .. భూమికలకు తిరుగులేని స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది. ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించిన ఆ సినిమాను ఎ.ఎం. రత్నం నిర్మించారు. ఈ సినిమా 17 యేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన 'జనసేన' కార్యాలయంలో పవన్ ను కలుసుకుని పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఆ సినిమాకి సంబంధించిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. 

More Telugu News