Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రెండు రోజుల తేడాతో సమంత రెండు సినిమాలు
  • తిరుపతిలో 'భరత్ అనే నేను' విజయోత్సవం 
  • మీడియాకు నాగశౌర్య విజ్ఞప్తి! 

*  ఇటీవల రిలీజైన 'రంగస్థలం' సినిమాతో తన ఖాతాలో మరో సక్సెస్ ను జోడించుకున్న అందాలతార సమంత నటించిన రెండు సినిమాలు రెండు రోజుల తేడాతో ఈ వేసవిలో విడుదల కానున్నాయి. ఆమె నటించిన 'మహానటి' మే 9న.. 'అభిమన్యుడు' మే 11న రిలీజవుతున్నాయి. సమంత అభిమానులకు ఇది పండగే.
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రం సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విజయోత్సవాన్ని ఈ నెల 27న తిరుపతి పట్టణంలో భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా, రాజకీయ రంగాల ప్రముఖులు దీనికి హాజరవుతారు.      
*  తాను నటించిన 'అమ్మమ్మగారిల్లు' చిత్రానికి రేటింగ్స్ ఇవ్వద్దని కోరుతున్నాడు హీరో నాగశౌర్య. 'ఇది అనుబంధాలతో కూడిన సినిమా. దయచేసి ఈ చిత్రానికి మీడియా మిత్రులు ఎవరూ రేటింగ్ ఇవ్వద్దు. ఇది రేటింగ్ ఇచ్చే సినిమా ఎంతమాత్రం కాదు' అని విజ్ఞప్తి చేశాడు నాగశౌర్య.   

More Telugu News