nagachaitanya: భారీ యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య

  • 'శైలజా రెడ్డి అల్లుడు'గా చైతూ
  • హైదరాబాద్ లో కొనసాగుతోన్న షూటింగ్ 
  • వచ్చేనెలలో చైతూ ఫస్టులుక్

నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'సవ్యసాచి' .. ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు ఆయన మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా చేస్తున్నాడు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది.

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. చైతూ .. తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శైలజా రెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండటం విశేషం. ఈ సినిమాకి ఆమె పాత్ర హైలైట్ అవుతుందని చెబుతున్నారు. ఇంతవరకూ మారుతి మలచిన హీరోల పాత్రలకి .. ఈ సినిమా కోసం మలచిన హీరో పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి వచ్చేనెలలో చైతూ ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. 

More Telugu News