Commonwealth Games: పదే పదే తప్పులు చేసి ఓడిపోయిన కిడాంబి శ్రీకాంత్!

  • బ్యాడ్మింటన్ ఫైనల్ లో ఓడిపోయిన శ్రీకాంత్
  • చాంగ్ వీ లీతో పోటీ పడిన శ్రీకాంత్
  • 21-19, 21-14, 21-14 తేడాతో ఓటమి

ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ పోటీల్లో భాగంగా జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల ఫైనల్స్ లో తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. ఫైనల్ లో మలేషియాకు చెందిన వరల్డ్ నంబర్ 2 ఆటగాడు చాంగ్ వీ లీతో పోటీ పడిన శ్రీకాంత్ మూడు సెట్ల పోరులో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.

తొలి సెట్ ను 21-19 తేడాతో గెలుచుకున్న శ్రీకాంత్, ఆపై జరిగిన రెండు, మూడో సెట్లలో పదే పదే తప్పులు చేయడం కనిపించింది. కనీసం పది పాయింట్లను చేజేతులా చేసిన తప్పుల కారణంగా చాంగ్ కు సమర్పించుకున్నాడు. రెండో సెట్ ను 21-14 తేడాతో గెలుచుకున్న చాంగ్, మూడో సెట్ ను కూడా 21-14 తేడాతో గెలుచుకుని స్వర్ణ పతకాన్ని సాధించాడు.

More Telugu News