allu arjun: 'నా పేరు సూర్య' నుంచి బ్యూటిఫుల్ లవ్ సాంగ్ రిలీజ్

  • బన్నీ హీరోగా 'నా పేరు సూర్య'
  • ఈ నెల చివరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • వచ్చేనెల 4న సినిమా రిలీజ్

వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'నా పేరు సూర్య' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ కనిపించనుంది. విశాల్ - శేఖర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. విశాల్ శేఖర్ స్వరపరిచిన రెండు పాటలను ఇప్పటికే వదలగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ' బ్యూటీ ఫుల్ లవ్' అనే పాటని రిలీజ్ చేశారు.

 'పెదవులు దాటని పదం పదంలో.. కనులలో దాగని నిరీక్షణంలో .. నాతో ఏదో అన్నావా.. "  అంటూ ఈ పాట కొనసాగుతోంది. చక్కని లవ్ ఫీల్ తో అలా అలా సాగే ఈ పాట దృశ్యం పరంగా చూస్తే నిజంగానే బ్యూటీఫుల్ గా అనిపిస్తుందని చెప్పొచ్చు. సిరివెన్నెల సాహిత్యం .. విశాల్ శేఖర్ సంగీతం అనుభూతి ప్రధానంగా .. ఆహ్లాదకరంగా కొనసాగుతూ హాయిని కలిగిస్తున్నాయి. ఈ నెల చివరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని, వచ్చేనెల 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News