Commonwealth Games: భారత్ పై డోపింగ్ మచ్చ... కామన్వెల్త్ నుంచి ఇద్దరు ఆటగాళ్ల వెలి!

  • ఆటగాళ్ల గదుల్లో లభించిన సిరంజిలు
  • వివరణ కోరగా సమాధానం ఇవ్వని ఆటగాళ్లు
  • ఇర్ఫాన్, రాకేష్ బాబులు తిరిగి ఇండియాకు

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల పోటీల్లో భారత్ పై డోపింగ్ మచ్చ పడింది. ఇద్దరు ఆటగాళ్లను నిర్వాహకులు వెనక్కు పంపారు. ఆ ఇద్దరి గదులు సిరంజిలు లభించడం, ఆపై క్రీడల నిర్వాహకులు వివరణ కోరగా, వారు సరైన సమాధానం చెప్పలేక పోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆటగాళ్ల శిబిరంలో సిరంజీలు దొరికిన ఘటనను సీరియస్ గా పరిగణించిన ఉన్నతాధికారులు రేస్ వాకర్ కేటీ ఇర్ఫాన్, ట్రిపుల్ జంపర్ రాకేష్ బాబులపై తదుపరి చర్యలకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు వారిద్దరినీ ఇండియాకు పంపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామని, వారిద్దరి శాంపిల్స్ సేకరించామని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది.

More Telugu News