Commonwealth Games: ఇంటర్వ్యూ తీసుకుంటూ స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయిన న్యూస్‌ ఛానెల్‌ రిపోర్టర్‌

  • కొనసాగుతోన్న కామన్వెల్త్‌ క్రీడా పోటీలు
  • ఇంగ్లాండ్‌ స్విమ్మర్లను ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్‌
  • ఒక్కసారిగా స్విమ్మింగ్‌పూల్‌లో పడ్డ వైనం

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్‌లో కామన్వెల్త్‌ క్రీడా పోటీలు జరుగుతోన్న విషయం తెలిసిందే. అందులో పాల్గొంటున్న ఇంగ్లాండ్‌ స్విమ్మర్లను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన ఓ అంతర్జాతీయ వార్తా ఛానల్‌ రిపోర్టర్‌ వారిని ప్రశ్నిస్తోన్న క్రమంలో స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

స్విమ్మర్లందరూ పూల్‌ ఒడ్డున కూర్చుని ఉండగా రిపోర్టర్‌ కూడా మొదట ఒడ్డున కూర్చునే వారిని ప్రశ్నించాడు. అనంతరం స్విమ్మింగ్‌ పూల్‌లో ఉన్న స్టెప్‌పైకి దిగాడు. అనంతరం చూసుకోకుండా ఇంకాస్త ముందుకి వెళ్లే ప్రయత్నం చేయడంతో నీళ్లలో పడ్డాడు. దీంతో స్విమ్మర్లు నవ్వుకున్నారు.                                                                                 

More Telugu News