military plane: కుప్పకూలిన అల్జీరియా మిలటరీ విమానం.. 105 మంది మృతి!

  • క్రాష్ అయిన అల్జీరియా మిలటరీ విమానం
  • టేకాఫ్ తీసుకున్న వెంటనే ప్రమాదం
  • ఆలివ్ చెట్ల మీద విమానం తోక భాగం

అల్జీరియాకు చెందిన మిలటరీ విమానం కుప్పకూలిన ఘటనలో 105 మంది వరకు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదం అల్జీరియా రాజధాని అల్జీర్స్ కు సమీపంలో ఉన్న బౌఫారిక్ ఎయిర్ పోర్టు వద్ద ఈ రోజు సంభవించింది. విమానంలో 100 మందికి పైగా మిటలరీ సిబ్బంది ఉన్నారు. వీరిలో 26 మంది వెస్టర్న్ సహారాకు చెందిన వారని తెలుస్తోంది.

మరో సమాచారం ప్రకారం... విమానంలో కనీసం 200 మంది ఉన్నారని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. 14 అంబులెన్స్ లు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించాయి. సహాయక చర్యలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు... ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల ఉన్న అన్ని రోడ్లను మూసేశారు.

విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న వెంటనే మిలటరీ విమానం క్రాష్ అయింది. ఈ ఎయిర్ పోర్టును మిలటరీ ఎయిర్ బేస్ గా వినియోగిస్తున్నారు. అల్జీరియా పశ్చిమ ప్రాంతంలో ఉండే బిచార్ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానిక టీవీ ఫుటేజీలో పెద్ద ఎత్తున నల్లటి పొగ కనిపిస్తోంది. విమానం క్రాష్ అయిన ప్రదేశంలో పెద్ద ఎత్తున సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. పక్కనే ఉన్న ఆలివ్ చెట్ల మీద విమానం తోక భాగం కనిపిస్తోంది.  

More Telugu News