Commonwealth Games: మరో రెండు స్వర్ణ పతకాలు... టాప్-3కి దూసుకెళ్లిన ఇండియా

  • భారత్ ఖాతాలో మొత్తం ఆరు స్వర్ణాలు
  • తాజాగా ఉమెన్ 10 మీటర్ పిస్టల్ విభాగంలో మనూ బాకర్ కు స్వర్ణం
  • రెండు రజతాలు, రెండు కాంస్యాలతో మొత్తం 10 పతకాలు

గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల పోటీల్లో పతకాల పట్టికలో భారత్ మరో స్థానానికి ఎగబాకింది. మొత్తం ఆరు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో 10 పతకాలు సాధించి టాప్-3లో నిలిచింది. పతకాల పట్టికలో 23 స్వర్ణాలతో ఆస్ట్రేలియా తొలి స్థానంలో, 14 పతకాలతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉన్నాయి. భారత్ తరఫున షూటింగ్ లో మనూ భాకర్ (ఉమెన్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్) స్వర్ణం సాధించగా, మహిళల వెయిట్ లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్ బంగారు పతకాన్ని కొల్లగొట్టింది. ఈ రెండు స్వర్ణాలు నేడు భారత్ ఖాతాకు వచ్చి చేరాయి. అంతకుముందు సైకోమ్ మీరాబాయి చాను, సంజితా చాను, రాగాల వెంకట్ రాహుల్, శివలింగం సతీష్ కుమార్ లు వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణాలు సాధించిన సంగతి తెలిసిందే.

More Telugu News