alu arjun: 'నా పేరు సూర్య' రిలీజ్ వాయిదా?

  • షూటింగ్ పూర్తి చేసుకున్న 'నా పేరు సూర్య'
  • రీ షూట్లు చెప్పిన బన్నీ 
  • ఆ దిశగా సన్నాహాలు     

అల్లు అర్జున్ హీరోగా .. వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' రూపొందుతోంది. రీసెంట్ గా అమెరికాలో ఒక పాటను చిత్రీకరించడం వలన, ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ చకచకా పూర్తవుతున్నాయి కనుక, చెప్పిన సమయానికి ఈ సినిమా మే 4వ తేదీన విడుదలవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్స్ కి రాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రష్ చూసిన అల్లు అర్జున్ .. కొన్ని సన్నివేశాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడట. ఆ సన్నివేశాలను రీ షూట్ చేయవలసిందేనని దర్శకుడితో చెప్పినట్టు సమాచారం. ఆ షెడ్యూల్ కి సంబంధించి ప్లాన్ చేస్తున్నారు. ఈ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కావొచ్చని అంటున్నారు. ఇక ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఈ నెల 15వ తేదీన జరుపనున్న సంగతి తెలిసిందే.    

More Telugu News