Lok Sabha: లోక్ సభ రేపటికి వాయిదా.. మిగిలింది రెండు రోజులు మాత్రమే.. సర్వత్ర ఉత్కంఠ

  • సభను అడ్డుకున్న అన్నాడీఎంకే ఎంపీలు
  • సభ ఆర్డర్ లో లేదన్న స్పీకర్ సుమిత్ర
  • అవిశ్వాసంపై చర్చ జరపకుండానే రేపటికి వాయిదా

11వ రోజు కూడా లోక్ సభ సమావేశాలు వాయిదా పడ్డాయి. అవిశ్వాసంపై చర్చ జరపకుండానే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. ఈ ఉదయం వాయిదా అనంతరం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది. అన్నాడీఎంకే ఎంపీలు యథాతథంగా వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు.

 ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, సభ ఆర్డర్ లో ఉంటేనే అవిశ్వాసంపై చర్చను కొనసాగిస్తామని చెప్పారు. అయినప్పటికీ ఆందోళనలు తగ్గకపోవడంతో.. సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. 6వ తేదీతో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందో? లేక చర్చ జరగకుండానే నిరవధికంగా వాయిదా పడుతుందో? అనే టెన్షన్ సర్వత్ర నెలకొంది. 

More Telugu News