DEBIT CARD PAYMENTS: కార్డులో బ్యాలన్స్ లేకుండా స్వైప్ చేస్తే చార్జీలతో బాదేస్తున్న బ్యాంకులు

  • డిక్లైన్డ్ లావాదేవీలపై చార్జీలు
  • ఎస్ బీఐ రూ.17, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో రూ.25
  • బ్యాలన్స్ లేకుండా స్వైప్ చేయవద్దు

కార్డుతో చెల్లిస్తున్నారా... ఖాతాలో తగినంత బ్యాలన్స్ ఉందో, లేదో ముందే చూసుకోండి. లేకుంటే చార్జీల భారం పడుతుంది. డిజిటల్ చెల్లింపులను పెంచాలన్న కేంద్రం ఆశయానికి బ్యాంకులు తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నాయి. తగినంత బ్యాలన్స్ లేకుండా కార్డుల ద్వారా చెల్లింపు చేసేందుకు ప్రయత్నిస్తే ఆ లావాదేవీ తిరస్కరణకు గురవుతుందని తెలిసిందే. అయితే ఈ తరహా డిక్లైన్డ్ లావాదేవీలపై బ్యాంకులు చార్జీలు రాబడుతున్నాయి.  

ఎస్ బీఐ అయితే ఏటీఎం లేదా పీఓఎస్ మెషిన్ల వద్ద కార్డు లావాదేవీ డిక్లైన్ అయితే రూ.17 చార్జీ విధిస్తోంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఏకంగా రూ.25 రాబడుతున్నాయి. ఈ చార్జీకి జీఎస్టీ అదనం. డీమోనిటైజేషన్ తర్వాత కార్డు లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మర్చంట్ డిస్కౌంట్ రేటు (పీవోఎస్ మెషిన్ ద్వారా లావాదేవీపై దుకాణాదారులు చెల్లించే చార్జీ)ను రద్దు చేసిన విషయం తెలిసిందే.

More Telugu News