Chandrababu: రేపు కూడా ఇదే స్ఫూర్తితో పోరాడండి: ఎంపీలకు చంద్రబాబు సూచన

  • ఆయా పార్టీలతో కూడా నోటీసులు ఇప్పించేలా చూడండి
  • ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు సడలించవద్దు
  • ఏపీ ప్రయోజనాలే మనకు ముఖ్యం
  • అవిశ్వాస తీర్మానానికి మద్దతు పెరుగుతోంది

అవిశ్వాస తీర్మానంపై టీడీపీ నోటీసులు ఇస్తున్నప్పటికీ పార్లమెంటులో చర్చ ప్రారంభం కావట్లేదన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీలతో ఈ రోజు టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు వారికి కీలక సూచనలు చేశారు. అలాగే ఈ రోజు పార్లమెంటులో జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై నోటీసులు ఇస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

సభలో హాజరు తగ్గకుండా చూడాలని చంద్రబాబు తమ ఎంపీలకు సూచించారు. మిగిలిన పార్టీల ఎంపీలు కూడా హాజరయ్యేలా ప్రయత్నించాలని, ఆయా పార్టీలతో కూడా నోటీసులు ఇప్పించేలా చూడాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు సడలించవద్దని, ఏపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు పెరుగుతోందని తెలిపారు. హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని వ్యాఖ్యానించారు. రేపు కూడా ఇదే స్ఫూర్తితో పోరాడాలని ఆదేశించారు.  

More Telugu News