BSF: ప్రధాని మోదీని ‘శ్రీ’ అని సంబోధించని ఫలితం.. ఏడు రోజుల వేతనం కోల్పోయిన బీఎస్ఎఫ్ జవాను!

  • ప్రధాని పేరుకు ముందు గౌరవ సూచకం ఉపయోగించని జవాను
  • బీఎస్ఎఫ్ చట్టం కింద దోషిగా తేల్చిన కమాండింగ్ ఆఫీసర్
  • నెల జీతంలో ఏడు రోజుల వేతనం కోత

ప్రధాని నరేంద్రమోదీని ‘గౌరవించని’ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాను ఏడు రోజుల వేతనాన్ని కోల్పోయాడు. ప్రధాని మోదీకి ముందు ‘ఆనరబుల్’ లేదంటే ‘శ్రీ’ అనడాన్ని మర్చిపోయిన జవానుకు జరిమానాగా అతడి వేతనంలో కోత విధించడం చర్చనీయాంశంగా మారింది. గత నెల 21న పశ్చిమబెంగాల్‌లోని మహత్‌పూర్ బీఎస్ఎఫ్ 15వ బెటాలియన్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

రోజువారీ నిర్వహించే పరేడ్‌లో పాల్గొన్న కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ రిపోర్టు ఇస్తూ ‘మోదీ ప్రోగ్రాం’ అని పేర్కొన్నాడు. మోదీకి ముందు గౌరవసూచకంగా ఉపయోగించే ‘ఆనరబుల్’, ‘శ్రీ’ వంటి పదాన్ని ఉపయోగించకపోవడంతో దీనిని తీవ్రంగా పరిగణించిన బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అనూప్ లాల్ భగత్ అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. బీఎస్ఎఫ్ యాక్ట్ సెక్షన్ 40 ప్రకారం కుమార్‌ను దోషిగా తేల్చి నెల వేతనంలో ఏడు రోజుల జీతాన్ని కట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వేతనంలో కోత విధించడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News