BJP: మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి... మేఘాలయాలో హంగ్‌!

  • త్రిపురలో బీజేపీ ఘనవిజయం
  • మేఘాలయాలో కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు (21)
  • నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ ప్లస్‌ విజయం
  • త్రిపురలో 59, మేఘాలయలో 59, నాగాలాండ్‌లో 60 స్థానాలకు జరిగిన ఎన్నికలు

త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. త్రిపురలో బీజేపీ ఘన విజయం సాధించింది. సీపీఎం కూటమికి 16 సీట్లు మాత్రమే దక్కగా, బీజేపీకి 44 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కి ఒక్క సీటు కూడా రాలేదు. కాగా, మేఘాలయాలో కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు (21) వచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ రాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 సీట్లు కావాలి.

ఎన్‌పీపీ 19, ఇతరులు 16, బీజేపీ 2, ఎన్‌సీపీ ఒక స్థానంలో గెలిచాయి. స్వతంత్ర అభ్యర్థులతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు నాగాలాండ్‌లో బీజేపీ వివిధ పార్టీలతో కలిసి నేషనల్‌ డెమొక్రటిక్‌ ప్రొగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ ప్లస్‌)గా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమి మొత్తం 30 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. నాగా పీపుల్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌) 28 స్థానాలు గెలుచుకుంది. త్రిపురలో 59, మేఘాలయలో 59, నాగాలాండ్‌లో 60 స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

More Telugu News