Tripura: త్రిపురలో బీటలువారిన కమ్యూనిస్టుల కంచుకోట.. ఆధిక్యంలో బీజేపీ

  • త్రిపురలో మొత్తం స్థానాలు 59
  • 35 స్థానాల్లో బీజేపీ ముందంజ
  • 24 స్థానాలకు పడిపోయిన సీపీఎం

త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. త్రిపురలో ఉత్కంఠభరిత ట్రెండ్స్ వెలువడుతున్నాయి. కమ్యూనిస్టుల కంచు కోట అయిన త్రిపురలో కాషాయ జెండా రెపరెపలాడుతోంది. బీజేపీ దెబ్బకు కమ్యూనిస్టుల కంచు కోట బద్దలవుతోంది.

మొత్తం 59 స్థానాలు ఉన్న త్రిపురలో బీజేపీ 35 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. సీపీఎం 24 స్థానాల్లో ముందంజలో ఉండగా... కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యతను సాధించకుండా డీలా పడింది. త్రిపుర తాజా ట్రెండ్స్ తో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, ఈ ఎన్నికల ఫలితాలు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మొత్తం రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేస్తాయని అన్నారు. 2013 ఎన్నికల్లో త్రిపురలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేకపోవడం గమనార్హం. 

More Telugu News