PNB: బ్యాంకు మోసగాడు నీరవ్ మోదీ దిష్టిబొమ్మ దగ్ధానికి ఏర్పాట్లు

  • ముంబైలోని వర్లీలో 58 అడుగుల నీరవ్ దిష్టిబొమ్మ
  • ఆయన్ని తలపించేలా బొమ్మకు అలంకరణ
  • హోలిక దహన్ ఉత్సవంలో భాగంగా దహనం

కోట్లాది రూపాయల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడయిన వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ 58 అడుగుల దిష్టిబొమ్మను ముంబైలోని వర్లీలో ఉన్న బీడీడీ చావల్ వాసులు దగ్ధం చేయనున్నారు. హోలిక దహన్ ఉత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

 నీరవ్ మోదీ దిష్టిబొమ్మను ఓ పొడవాటి వజ్రంపై కూర్చోబెట్టారు. బొమ్మకు బ్రౌన్ కలర్ కోటు వేశారు. బొమ్మ కింద ఉండే బోర్డుపై 'పీఎన్‌బీ స్కాం..డైమండ్ కింగ్' అని రాసుంది. కాగా, నీరవ్‌తో పాటు ఈ కుంభకోణంలో మరో నిందితుడయిన ఆయన మామ, గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ మేహుల్ చోక్సీలను దర్యాప్తు సంస్థలు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ, ఈడీ రెండు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించాయి.

More Telugu News