mayank agarwal: ఈ ఏడాది కెరీర్ తోపాటు ప్రేమలో కూడా విజయం సాధించాను: క్రికెటర్ మయాంఖ్ అగర్వాల్

  • జీవితంలో కూడా విజయం సాధించాను
  • ఈ సీజన్ లో 2,141 పరుగులు చేశాను
  • ప్రియురాలికి ప్రేమ ప్రతిపాదన కూడా చేశాను

ఈ సీజన్‌ అద్భుతంగా సాగిందని ఐపీఎల్ సీజన్-10 ద్వారా వెలుగులోకి వచ్చిన క్రికెటర్ మయాంఖ్ అగర్వాల్ తెలిపాడు. విజయ్ హజారే టోర్నీలో 723 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన మయాంఖ్ అగర్వాల్ ఈ సీజన్ అద్భుతంగా సాగిందని, కేవలం కెరీర్ లోనే కాకుండా జీవితంలో కూడా విజయం సాధించానని పేర్కొన్నాడు.

శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు టోర్నీకి ఎంపికకాకపోవడం పట్ల స్పందించేందుకు నిరాకరిస్తూ,  ఈ సీజన్ లో మొత్తం 2141 పరుగులు చేశానని అన్నాడు. తన ప్రియురాలికి ప్రేమ ప్రతిపాదన కూడా చేశానని, తన ప్రతిపాదనను ఆమె అంగీకరించిందని మయాంక్‌ అగర్వాల్ ఆనందంగా చెప్పాడు. 

More Telugu News