Russia: వింటర్ ఒలింపిక్స్ కంప్యూటర్లను రష్యా హ్యాక్ చేసింది: అమెరికా తీవ్ర ఆరోపణ

  • వింటర్ ఒలింపిక్స్ కంప్యూటర్లను రష్యా హ్యాక్ చేసింది
  • వింటర్ ఒలింపిక్స్ ప్రారంభవేడుకల సందర్భంగా హ్యాకింగ్
  • హ్యాకింగ్ కు పాల్పడింది రష్యన్ మిలటరీ గూఢచారులు

వింటర్ ఒలింపిక్స్ కంప్యూటర్లను రష్యా హ్యాక్ చేసిందని అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. దక్షిణకొరియాలో జరుగుతున్న వింటర్‌ ఒలింపిక్స్‌ లో అధికారులు ఉపయోగించే వందలాది కంప్యూటర్లను రష్యా హ్యాక్‌ చేసి, వాటిలోని విలువైన సమాచారం తస్కరించిందని ఆరోపించింది. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభవేడుకల సందర్భంగా ఫిబ్రవరి 9న రష్యన్‌ మిలిటరీ గూఢచారులు హ్యాకింగ్ కు పాల్పడినట్టు తెలిపింది.

కాగా, వింటర్ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ సమయంలో సైబర్ దాడి జరిగిందని అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారు దానిని రష్యా చర్యగా పేర్కొనలేదు. ఇదిలా ఉంచితే, గతంలో డోపింగ్‌ ఆరోపణల కారణంగా రష్యన్‌ బృందంలోని సభ్యులపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో రష్యా నుంచి తక్కువ మంది క్రీడాకారులు హాజరయ్యారు. దీనికి ప్రతీకారంగా రష్యన్ గూఢచారులు హ్యాకింగ్ కు పాల్పడ్డారని అమెరికా ఆరోపించింది. నేడు జరుగనున్న ముగింపు వేడుకలను పర్యవేక్షించనున్నామని అమెరికా ప్రకటించింది. మరోపక్క, అమెరికా ప్రకటనను రష్యా ఖండించింది.

More Telugu News