pnb: పీఎన్ బీ స్కామ్ నేపథ్యంలో బ్యాంకులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త ఆదేశాలు

  • రుణాలపై సమీక్ష జరపాలని ఆదేశం
  • హాంగ్ కాంగ్ లోని నాలుగు బ్యాంకు శాఖలకు లేఖ
  • పీఎన్ బీ స్కామ్ నేపథ్యంలో చర్యలు

పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ స్కామ్ వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వరంగ బ్యాంకులకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. పీఎన్ బీ జారీ చేసిన లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ (హామీ పత్రాలు)ల ఆధారంగా రుణాలు ఇచ్చిన ఎస్ బీఐ, యాక్సిస్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖలకు లేఖ రాసింది.

ఎల్ వోయూల ఆధారంగా జారీ అయిన రుణం, వ్యయంతో సరిపోలిందా, లేదా? అన్నది సరిచూసుకోవాలని కోరింది. దీనివల్ల ఆయా రుణాల్లో ఏవైనా అవకతవకలు జరిగితే బయటపడే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాంకులు ఇప్పుడు రూ.250 కోట్లకు పైబడిన రుణాల విషయంలో ఓ ప్రతినిధి లేదా ఏజెన్సీని నియమించుకోనున్నాయి. ఆయా రుణాల స్థితిగతులను వారు పర్యవేక్షిస్తారు.

More Telugu News