pnb: పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం... కుదేలైన షేరు

  • ముంబై శాఖలో అక్రమ లావాదేవీలు
  • వీటి విలువ సుమారు రూ.11,000 కోట్లు
  • కొందరు ఖాతాదారులకు ప్రయోజనం
  • దర్యాప్తు ఏజెన్సీలకు ఫిర్యాదు చేశామన్న బ్యాంకు

ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ముంబై బ్రాంచ్ లో సుమారు రూ.11,000 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు స్వయంగా పీఎన్ బీ బాంబే స్టాక్ ఎక్సేంజ్ కు సమాచారం అందించింది. మోసపూరిత, అనధికారిక లావాదేవీలు కొందరు ఖాతాదారుల ప్రయోజనాల కోణంలో జరిగినట్టు గుర్తించామని పేర్కొంది.

ఈ లావాదేవీల ఆధారంగా ఆయా ఖాతాదారులకు విదేశాల్లో రుణాలు జారీ అయినట్టు వివరించింది. దీనిపై దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకునేందుకు వీలుగా దర్యాప్తు ఏజెన్సీలకు నివేదించామని, స్వచ్ఛమైన, పారదర్శక బ్యాంకింగ్ సేవలకు కట్టుబడి ఉన్నామని పంజాబ్ నేషనల్ బ్యాంకు తెలిపింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో పీఎన్ బీ షేరు ఈ రోజు 7 శాతం పతనమై రూ.150 స్థాయిలో ట్రేడవుతోంది.

More Telugu News