Rajendra prasad: రాజకీయాలు నాకు పడవు.. తేల్చేసిన నటుడు రాజేంద్ర ప్రసాద్

  • పాలకొల్లులో రాజేంద్రుడికి ఘన సత్కారం
  • 40 ఏళ్ల సినీ జీవితంలో అందరినీ నవ్వించడమే తెలుసు
  • చివరి వరకు అదే చేస్తా

తన ఒంటికి రాజకీయాలు ఏమాత్రం సరిపడవని, కాబట్టి అందులోకి వచ్చే ప్రసక్తే లేదని సీనియర్ నటుడు, నట కిరీటి రాజేంద్రప్రసాద్ తేల్చి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీరపురి అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ సంస్థ ఆధ్వర్యంలో రాజేంద్ర ప్రసాద్‌ను ‘జీవిత సాఫల్యతా పురస్కారం’తో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల తన సినీ జీవితంలో అందరినీ నవ్వించడమే పరమావధిగా పెట్టుకున్నానని అన్నారు. రాజకీయాలు తనకు ఏ మాత్రం సరిపడవని, కాబట్టి అందులోకి వచ్చే ప్రసక్తే లేదని అన్నారు.

రాజేంద్ర ప్రసాద్ రాజకీయాల్లోకి రానున్నట్టు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. పలానా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల సినీ నటులు వరుస పెట్టి రాజకీయాల్లోకి వస్తుండడంతో ఈ వార్తకు కూడా ప్రాధాన్యం లభించింది. దీంతో స్పందించిన నట కిరీటి తనకు అటువంటి ఉద్దేశం లేదని, ఆరోగ్యం సహకరించినంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని వివరించారు.

More Telugu News