Allu Arjun: బన్నీ మలయాళ ఫస్టు ఇంపాక్ట్ కి అదిరిపోయే రెస్పాన్స్

  • బన్నీకి మలయాళంలో మంచి మార్కెట్ 
  • మలయాళ ఫస్టు ఇంపాక్ట్ కి మంచి ఫీడ్ బ్యాక్ 
  • తెలుగుతో పాటే అక్కడా రిలీజ్

అల్లు అర్జున్ కథానాయకుడిగా 'నా పేరు సూర్య' రూపొందుతోంది. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాకి వక్కంతం వంశీ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తెలుగుతో పాటు మలయాళంలోను ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మలయాళంలో ఈ సినిమాకి "ఎంటె పేరు సూర్య .. ఎంటె వీడు ఇండియా' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ సినిమా మలయాళ ఫస్టు ఇంపాక్ట్ ను నిన్న విడుదల చేశారు. తెలుగులో మాదిరిగానే మలయాళంలోను ఈ ఫస్టు ఇంపాక్ట్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ మలయాళ మార్కెట్ ను మరింతగా పెంచేలా ఈ సినిమా వుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఏప్రిల్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

More Telugu News